Monday, October 1, 2007

idi telusa


మీకు తెలుసా?
...పూర్వ నిమ్స్‌ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు తానా వ్యవస్థాపకుడు మరియు మెదటి అధ్యక్షుడు అని మీకు తెలుసా
.... ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాలు కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే.
.... ప్రపంచం లొ అతి పెద్దదైన శివుని విగ్రహం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా మురుడేశ్వరలో ఉన్నదని

.....డచ్‌ వారి అవశేషాలు ఇప్పటికి ఉన్న భీమునిపట్నం భారతదేశం లొని రెండవ మునిసిపాలిటి అని
.....దక్షిణ చిరపుంజి గా పేరు గాంచిన ఆగుంబె భారతదేశం లొనే అత్యధిక వర్షపాతం నమోదుచేసుకొంటున్న ప్రదేశాలలొ రెండవ స్థానం
... కళ్ళు అనే తెలుగు సినిమాను ఆస్కారు నామినేషనుకు ఎంపికచేబడినదని.
...భారతీయ సినిమా రంగములో మొట్టమొదటి ద్విపాత్రాభినయము చేసిన తొలి నటి, కలకత్తాకు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్ కూపర్ అని.
నరస భూపాలీయం గా ప్రఖ్యాతి చెందిన కావ్యాలంకార సంగ్రహ కర్త రామరాజ భూషణుడు అని.
శబ్దాలంకారాలకు ప్రసిద్ధుడైన తెలుగు పూర్వకవి పోతన అని.
...కృష్ణుని ప్రియ మిత్రుడు, సహాధ్యాయి సుదాముని స్వస్థలము, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన నేటి పోర్‌బందర్ అని.
...పాకిస్తాన్ లో మాట్లాడే ఏకైక ద్రవిడ భాష బ్రహుయి అని. ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష.
... జగ్గయ్య, లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు అని.
... 1934 లో విడుదలైన తొలి కన్నడ టాకీ చలనచిత్రము సతీ సులోచనను తీసినది తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు మరియు తెలుగు సినీనటి లక్ష్మి తండ్రి అయిన యెర్రగుడిపాటి వరదరావు(వై.వి.రావు) అని.
... ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్థావన సాహిత్యములో తొలిసారిగా చేసినది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజములలో ఒకడైన మాదయ్యగారి మల్లన అని.
... 1885లో పుట్టిన సురభి వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు అని. కడప జిల్లా సురభి గ్రామంలో మొదట కీచక వధ తో సురభి నాటక ప్రస్థానం మొదలయ్యిందని.
...హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన అలంఅరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఎల్.వి.ప్రసాద్ నటించాడని.
...హైదరాబాదునందలి ట్యాంకుబండ్నందు మొత్తం 32 మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయని!..
...19వ శతాబ్దంలో ఆంధ్ర దేశములోని ప్రతి గ్రామమునకు 12 మంది గ్రామ సేవకులు ఉండేవారనీ, వారిని బారబలావతి అనేవారనీ.
...తెలుగు అనే శబ్దం త్రిలింగ నుండి వచ్చిందని చదువుకుంటూ వచ్చాం. కాదు, తెలివాహ అని పిలవబడిన గోదావరి నుండి వచ్చింది అని అంటోంది ఈ పరిశోధనాత్మక వ్యాసం.
రాయలసీమ కు ఆ పేరు పెట్టింది గాడిచర్ల హరిసర్వోత్తమ రావు. 1928 లో కర్నూలు జిల్లా నంద్యాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు. అంతకు ముందు దానిని దత్తమండలం (Ceded) అని పిలిచేవారు.
1951 లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీకి భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు పోటీకి వచ్చాయి. వాటిలో రెండవ బహుమతిని భారత కథే గెలుచుకుంది. ఆ కథ పేరు గాలివాన , రచయిత పాలగుమ్మి పద్మరాజు - తెలుగు వాడి కథ.
...మన జాతీయ పతకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగు వారేనని.
...బంగాళాఖాతము ను తూర్పు సముద్రం అని పిలిచేవారని.
...మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన టైటానిక్‌ లో ప్రయాణించిన ఏకైక భారతీయ కుటుంబం గుంటూరు నుండి అని. అయితే వీరు బ్రిటిషు వారు.
...ఆలంపూర్ లోని నవబ్రహ్మ దేవాలయములు శివుని గుళ్లని.
...కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల నాయకుల ‌మధ్య జరిగిన పెద్దమనుషుల ఒప్పందం, 1956 లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణకు మార్గం సుగమము చేసిందని.
...తెలుగు భారత దేశం లో అత్యంత ఎక్కువ మంది మాట్లాడే భారతీయ భాషలలో హిందీ తర్వాత రెండవదని.
తొలి తెలుగు మూకీ చిత్రం 1920 లలో తీసిన భీష్మ ప్రతిజ్ఞ అని.
తెలుగు నాట తీయబడ్డ తొలి తెలుగు చిత్రం భక్త మార్కండేయ (1926) అని.
తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద (1931) అని.
తెలుగులో ఒకరి జీవిత కథ ఆధారంగా తీసిన తొలి (బయోగ్రాఫికల్) సినిమా భక్త రామదాసు (1933) అని.
తొలి తెలుగు సాంఘిక చిత్రం ప్రేమ విజయం (1936) అని.
తొలి తెలుగు అభ్యుదయ చిత్రం మాలపిల్ల (1938) అని.
తొలి తెలుగు డాక్యుమెంటరీ మహాత్మా గాంధీ అని.
ఒక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో పాల్గొన్న తొలి తెలుగు సినిమా స్వర్గసీమ (1945) అని.
రాష్ట్రప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన మొదటి చిత్రం 'పదండి ముందుకు' (1962) అని.
తొలి తెలుగు రంగుల సినిమా లవకుశ (1963) అని.
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి. ఈయన భారతరాష్ట్ర్రపతిగా కూడాపనిచేసారు.
రాష్ట్రప్రభుత్వ నంది బహుమతి పొందిన తొలి సినిమా డాక్టర్ చక్రవర్తి (1964 లో) అని.
తొలి తెలుగు ‌జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116 (1966) అని.
తొలి తెలుగు కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు (1971) అని.
తొలి తెలుగు స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు (1974) అని.
జాతీయ బహుమతి పొందిన తొలి తెలుగు పాట 'తెలుగువీర లేవరా' (1974) అని.
తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా సింహాసనం (1986) అని.
1952 లో తొలి మిస్ మద్రాసు టంగుటూరి సూర్యకుమారి.
రాష్ట్రగీతమైన "మా తెలుగుతల్లికి...." గీతాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి తిరుపతిలో జన్మించారని.
Retrieved from "http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%81_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B0%BE%3F_%E0%B0%AD%E0%B0%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81"

2 comments:

Unknown said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

Unknown said...

Good Piece of Information Telugu Blogs Baaga ne Maintain Chestunnaru Keep it Up

Teluguwap,Telugu4u

Tollywood,Tollywood Updates , Movie Reviews